ALL CATEGORIES

Title : Viniyogadarude Raju - వినియోగదారుడే 'రాజు'!!

Author : Rajyalakshmi Rao - రాజ్యలక్ష్మీ రావు

Publication : Alakananda Prachuranalu - అలకనంద ప్రచురణలు

Description :

ఈ పుస్తకంలో జాతీయ కమిషన్‌లో న్యాయాన్ని అందిస్తున్న శ్రీమతి రాజ్యలక్ష్మీ రావు నిజజీవితంలో జరిగిన ఘట్టాలను తెలిపారు. వినియోగదారుల చట్టంకు సంబంధించి ముఖ్యమైన అంశాలను ఇందులో ఒకేచోట పొందుపరచడమే కాక, వినియోగదారుల కోర్టును ఎలా ఆశ్రయించాలో మార్గదర్శకత్వాన్ని కూడా అందించారు. ఈ పుస్తకం న్యాయవాదులకు, వినియోగదారుల కార్యకర్తలకు, విద్యార్థులకు, సామాన్యులకు కూడా ఉపయోగపడుతుందనే నమ్మకం నాకుంది. - జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

అతి సరళమైన భాషలో సామాన్యుడికి అర్థమయ్యేలా రాజ్యలక్ష్మీరావు ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులోని కార్టూన్లు పాఠకుడికి విషయాన్ని మరింత సన్నిహితంగా మారుస్తుంది. ఈ పుస్తకం వినియోగదారుల పరిరక్షణ చట్టం క్రింద గుర్తించిన వినియోగదారు హక్కులను, అందుకు అవసరమైన వినియోగ విద్యను పెంపొందించేందుకు ఎంతో తోడ్పడుతుంది. సామాన్యులకే కాక న్యాయవాదులకు, వనియోగదారుల వేదికలకు దీని ప్రయోజనం ఎంతో ఉంది.

- జస్టిస్‌ ఎం.బి.షా, అధ్యక్షులు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌

వినియోగదారుడే రాజు అయ్యే రోజు మన దేశంలో వస్తుందని నేనెంతో కలు కన్నాను. ఈ పుస్తకం శీర్షిక చూడగానే నా కలలు నిజమయ్యే రోజులు వచ్చాయని నాకు అనిపించింది. ఇందుకు ఘనత శ్రీమతి రాజ్యలక్ష్మీ రావుకు దక్కుతుంది. ఈ పుస్తకం కేవలం సమస్యలనే కాక వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించింది. వినియోగదారుల హక్కులు, వాటి గురించి వినియోగదారుడికి చైతన్యం కలిగించడం, వాటిని పరిరక్షించడం, అతడికి ఎలా న్యాయం లభిస్తుందో సూచించడం ఈ పుస్తకం చర్చిస్తుంది. ఈ రంగంలో 17 సంవత్సరాల అనుభవం గల రాజ్యలక్ష్మీరావు వినియోగదారుల వేదనలను వ్యక్తిగతంగా చూశారు. ఆ అనుభవంతో ఈ పుస్తకం రాశారు. ఇది సామాన్యుడికీ, న్యాయవాదులకూ ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. వినియోగదారుల పరిరక్షణ గురించి అద్భుతంగా వివరించిన మొదాటి భారతీయ పుస్తకం ఇది అనడంలో అతిశయోక్తి లేదు.

- జస్టిస్‌ ఆర్‌.సి. లహోటీ, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి

పేజీలు : 376