ALL CATEGORIES

సంస్కృతంలోని శ్రవ్య, దృశ్య మరియు ఆంధ్ర పంచ కావ్యాల కథా సమాహారం 'సంస్కృతాంధ్ర కావ్య కథలు'.

కావ్యం యొక్క మూలకథా స్వరూపం పూర్తిగా పాఠకులకు తెలిపేందుకే శ్రీమాన్‌ ఎస్‌.టి.జి. అంతర్వేది కృష్ణమాచార్యులుగారు ఈ ''సంస్కృతాంధ్ర కావ్య కథలు'' అన్న గ్రంథాన్ని రచించారు.  టీ.వీ.లే సర్వవిజ్ఞానభాండాగారాలుగా పరిణమించి శ్రవణ - పఠనాదులకు అంత తావులేని ఈ రోజుల్లో అంతర్వేది వారు చేసిన ఈ రచన ఆయాకావ్యాలు 'చదవాలి' అనే కోరిక పాఠకులకు కలిగిస్తుందనడంలో సందేహం లేదు. నేటి సమాజానికి ఇది అత్యంత ఆవశ్యకం.

రఘు వంశం : సాహితీ సౌథ ప్రాంగణంలో కాళిదాసు చేత వెలిగించబడిన మహా కావ్య దీపశిఖ రఘువంశం. మహాకావ్య లక్షణ లక్షితమైన రఘువంశ కావ్యంలో మొత్తం 25 సర్గలున్నాయి అని చారిత్రకుల అభిప్రాయం. కాని ప్రస్తుతం మనకు 19 సర్గలే లభిస్తున్నాయి. వీటిలో మొదటి 9 సర్గలలో శ్రీరాముని చరిత్ర, 16 నుండి 19 సర్గలలో కుశుడు మొదలుగా గల 24 మంది రాజుల కథ వర్ణించబడింది.

రఘువంశ కావ్యంలో కవి చేసిన వర్ణనలు ఎంతో రమణీయమైనవై, తరువాతి కవులకు మార్గదర్శకంగా నిలిచాయి. కావ్యంలో సందర్బానుసారంగా నవరసాలు ప్రయోగించబడినాయి. ఇక కాళిదాసు గారి ఉపమాలంకార ప్రయోగాలు మనోహరమై హృదయోల్లాసాన్ని కలిగిస్తాయి.