ALL CATEGORIES

ఇది గురు-శుక్ర సమస్త ప్రభావములు మరియు చంద్రకళానాడి అనే రెండు పుస్తకముల సంపుటి. మానవ జీవితములపై గురు శుక్రుల ప్రభావములను విపులంగా విశదీకరించేదే.. గురు-శుక్ర సమస్త ప్రభావములు అనే పుస్తకం. ఇక రెండవదైన చంద్రకళానాడి అనే గ్రంథము కేరళ దేశమునకు చెందిన అచ్యుతుడు, వెంకటేశుడు అను దైవజ్ఞులు రచించారు. దీనినే 'దేవకేరళం' అని కూడా అంటారు. ప్రస్తుత పుస్తకంలో చంద్రకళానాడి సంగ్రహానువాదం చేయడం జరిగింది. వివిధ లగ్నములకు వివిధ నాడీ అంశల ఫలితములు పట్టిక విధానములో వ్రాశాను. జాతకుని యొక్క మేనమామ, మేనత్త, పినతండ్రి మొ|| విషయముల మూల గ్రంథములో వివరించినవి వ్రాయలేదు. ప్రస్తుత ప్రయోజనకారి కానిదని భావించి భవిష్య ఫలితములు, జాతకుని వివరములు మాత్రమే ప్రధానంగా వ్రాయడం జరిగింది.